ఆగస్టు 30న నీట్‌ పీజీ-2026 పరీక్ష.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

by Ramesh Naini |

నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్ సైన్సెస్‌ నీట్ పీజీ-2026 షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఆగస్టు 30న నీట్‌ పీజీ-2026 పరీక్ష.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్ సైన్సెస్‌ (NBEMS) నీట్ పీజీ-2026 షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షను ఆగస్టు 30న కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూలై 1 సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూలై 21 వరకు అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ వివరాలను ఆగస్టు 11న వెల్లడించనుండగా, ఫలితాలను సెప్టెంబర్ 30 నాటికి విడుదల చేయనున్నారు.

ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి..

దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌లోని 'ఇన్ఫర్మేషన్ బులిటెన్‌'ను క్షుణ్ణంగా చదవాలి. పరీక్షా కేంద్రాల కేటాయింపు అనేది ‘ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందు’ (first come first serve) ప్రాతిపదికన ఉండదు. కాబట్టి ముందుగా దరఖాస్తు చేసినంత మాత్రాన కోరుకున్న సెంటర్ వస్తుందనే గ్యారెంటీ లేదని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తులో అప్‌లోడ్ చేసే ఫోటో మూడు నెలల కంటే పాతది కాకూడదు. ఫోటో, సంతకం బోర్డు నిర్దేశించిన నిబంధనల ప్రకారమే అప్‌లోడ్ చేయాలి. ఆఖరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. అలాగే పరీక్ష రోజున బయోమెట్రిక్, వెరిఫికేషన్ కోసం నిర్ణీత సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.. అధికారులు కీలక సూచనలు జారీ చేశారు.

Next Story