- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముల్కలపల్లి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
by Taduka Kalyani |
గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామ శివారులో జూన్ 27న జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

X
దిశ, గుర్రంపోడు: గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామ శివారులో జూన్ 27న జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మృతురాలు చవ్వ అరుణ (29) హత్య కేసులో క్రైమ్ నం. 105/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1), 80 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు చవ్వ మహేందర్ (32), తండ్రి యాలాద్రి, కులం యాదవ్, వృత్తి ప్రైవేట్ ఉద్యోగి, ప్రస్తుతం నల్లగొండ టౌన్‌లో నివాసముంటున్న వ్యక్తిని గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని దేవరకొండ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు పత్రికా ప్రకటనలో తెలిపారు.
Next Story






