'బార్బెక్యూ నేషన్స్'లో కుళ్ళిన మాంసం

by Muthe.Rajitha |

హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్ బార్బెక్యూ నేషన్స్ లో కుళ్ళిన చికెన్, పండ్లను గుర్తించారు అధికారులు.

బార్బెక్యూ నేషన్స్లో కుళ్ళిన మాంసం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రెస్టారెంట్ చైన్ 'బార్బెక్యూ నేషన్' ఉప్పరపల్లి బ్రాంచ్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇటీవల ఈ రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రమైన ఫుడ్ పాయిజన్‌కు గురికావడంతో, బాధితుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా కిచెన్, స్టోరేజ్ రూమ్‌లను పరిశీలించిన అధికారులకు విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన కుళ్ళిపోయిన చికెన్, పాడైపోయిన పండ్లను అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన (Expired) ఫుడ్ ఐటమ్స్, ఐస్‌క్రీమ్‌లపై పాత డేట్లను దాచి, కొత్తగా ఎక్స్‌పైరీ డేట్ స్టిక్కర్లు వేసి వినియోగిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. వంటగది తీవ్ర అపరిశుభ్రతతో, కనీస నిబంధనలు పాటించకుండా ఉండటంపై అధికారులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ నుండి సేకరించిన ఆహార పదార్థాల నమూనాలను ల్యాబ్ పరీక్షల నిమిత్తం పంపించారు. నివేదికలు వచ్చిన అనంతరం రెస్టారెంట్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Next Story