చెన్నయ్ జట్టులోకి హార్దిక్ పాండ్యా?.. క్లారిటీ ఇచ్చిన సీఎస్కే సీఈవో

by Harish |

భారత స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎంఐని వీడనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది.

చెన్నయ్ జట్టులోకి హార్దిక్ పాండ్యా?.. క్లారిటీ ఇచ్చిన సీఎస్కే సీఈవో
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎంఐని వీడనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. చెన్నయ్ సూపర్ కింగ్స్‌తోపాటు పలు ఫ్రాంచైజీలు అతని కోసం పోటీపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కొట్టిపారేశారు. తాము ఎలాంటి ట్రేడ్ డీల్స్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ ముగిసిన తర్వాత సీజన్ రివ్యూ అనంతరమే తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు.అలాగే, ముంబై ఇండియన్స్ కూడా పాండ్యా ట్రేడ్‌ చర్చలను తోసిపుచ్చింది. ‘ప్రస్తుతం మేము ప్లేయర్ ట్రేడ్ గురించి చర్చలు జరపడం లేదు. రివ్యూ పూర్తయిన తర్వాతే మేము నిర్ణయం తీసుకుంటాం.’అని ఎంఐ వర్గాలు పేర్కొన్నాయి.


Next Story