- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో AI ట్రాఫిక్ సిగ్నల్స్.. అనలాగ్, మెగా సంస్థలతో సర్కార్ బిగ్ డీల్
హైదరాబాద్ ట్రాఫిక్, మౌలిక వసతుల రంగంలో సరికొత్త విప్లవం రానుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో రవాణా, మౌలిక వసతుల రంగాన్ని సరికొత్త సాంకేతికతతో తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ అనలాగ్ (Analog), మౌలిక వసతుల దిగ్గజం మెగా ఇంజనీరింగ్ (MEIL) సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్రంలో అత్యాధునిక ప్రాజెక్టులను చేపట్టేందుకు అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రుల సమక్షంలో అనలాగ్ సీఈఓ అలెక్స్ కిప్‌మాన్, మెగా ఎండీ పి.కృష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అయితే, భవిష్యత్ తరాల అవసరాల కోసం ‘నెక్స్ట్ జనరేషన్ ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’, రోబోటిక్స్, సెన్సార్ల ఆధారిత ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ ప్లాట్‌ఫామ్స్ వినియోగాన్ని ప్రతినిధులు సీఎంకు వివరించారు. దీని ద్వారా హైదరాబాద్‌ను ‘కాగ్నిటివ్ సిటీ’గా మార్చవచ్చని.. రోడ్లపై అంబులెన్స్‌లకు ఆటోమేటిక్‌గా మార్గం సుగమం చేయడం, నీటి లీకేజీలను ముందే గుర్తించడం, స్మార్ట్ పవర్ మేనేజ్‌మెంట్ వంటి సేవలు సాధ్యమవుతాయని తెలిపారు. నగరంలో చేపట్టబోయే ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్టు వివరాలను కూడా ఈ సందర్భంగా సీఎంకు సమర్పించారు.
ఈ ప్రెజెంటేషన్‌పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఇరు సంస్థలకు పలు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంలోని అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఒకే గొడుగు కిందికి తెస్తూ ఇంటిగ్రేట్ చేయాలని, రోడ్లపై ఉండే రద్దీకి అనుగుణంగానే సిగ్నల్స్ ఆటోమెటిక్‌గా పనిచేసేలా చూడాలన్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు, భారీ వర్షాల వంటి అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా క్రమబద్ధీకరించేందుకు ఈ వ్యవస్థను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి అనుసంధానించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.






