వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవద్దు: ఏపీ హైకోర్టు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-01 11:18:31  IST  )

వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించారు. రాజధాని గ్రామాల పర్యటన నేపథ్యంలో నమోదైన కేసుల్లో ఊరట లభించింది. పోలీసు విచారణకు సహకరించాలని వైసీపీ నేతలకు సూచించింది. ...

వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవద్దు: ఏపీ హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(Ycp) నేతలపై చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు(Ap HighCourt) ఆదేశించారు. రాజధాని(Capital) గ్రామాల పర్యటన నేపథ్యంలో నమోదైన కేసుల్లో ఊరట లభించింది. పోలీసు విచారణకు సహకరించాలని వైసీపీ నేతలకు సూచించింది. తదుపరి విచారణకు ఈ నెల 8కి వాయిదా వేసింది. కాగా ఇటీవల ఉండవల్లిలో భూసేకరణ పరిశీలనకు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్నినాని, అప్పిరెడ్డి, అవినాశ్‌తో పలువురు నేతలు అక్కడికి వెళ్లారు. అయితే గతంలో వీరు ప్రవర్తించిన తీరును తప్పుబడుతూ స్థానిక రైతులు, ప్రజలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో శాంతి భద్రతల దృష్ట్యా భూసేకరణ పరిశీలనకు అనుమతి లేదంటూ అటు పోలీసులు సైతం అడ్డుకున్నారు.

స్థానికులు, వైసీపీ నేతల మధ్య ఘర్షణ

దీంతో స్థానికులు, వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు సైతం గాయాలయ్యాయి. దీంతో వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో వారందరినీ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో వైసీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. తమపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం వైసీపీ నేతల అభ్యర్థనతో ఏకీభవించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Next Story