- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కల్కి-2’లో ఆలియా భట్.. పోస్ట్‌తో హింట్ ఇచ్చిన ప్రభాస్!
మొదటి పార్ట్‌లో హీరోయిన్‌గా నటించిన దీపికా పదుకొణెను తొలగించి ఆలియాను ఫైనల్ చేసినట్లు టాక్.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘కల్కి-2’. ఈ సినిమా సూపర్ హిట్ అయిన ‘కల్కి’కి సీక్వెల్‌గా రాబోతుంది. అయితే ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ ప్రారంభం కాగా.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై మేకర్స్ పలు కీలక సన్నివేశాలను కూడా పూర్తి చేసేశారు. అయితే, గత కొంతకాలంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. మొదటి పార్ట్‌లో హీరోయిన్‌గా నటించిన దీపికా పదుకొణెను తొలగించి ఆలియాను ఫైనల్ చేసినట్లు టాక్. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.
ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఫిలిం ‘ఆల్ఫా’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ వీడియోను ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ‘‘'ఆల్ఫా' ట్రైలర్ అద్భుతంగా, ఎంతో ఆశాజనకంగా ఉందని ప్రశంసించారు. జూలై 3వ తేదీ కోసం ఆలియాకు, దర్శకుడికి చిత్ర బృందం మొత్తానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను’’ అని ప్రభాస్ రాసుకొచ్చారు. రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన ఈ క్రేజీ పోస్ట్‌ను ఆలియా భట్ వెంటనే తన సోషల్ మీడియాలో రీషేర్ చేస్తూ, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఈ సోషల్ మీడియా సంభాషణ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అయితే, ప్రభాస్ ఇలా ఆలియా సినిమా ట్రైలర్‌ను షేర్ చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఆలియా భట్ ‘కల్కి-2’ సినిమాలో నటిస్తోందనే విషయాన్ని ప్రభాస్ ఈ విధంగా ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చారంటూ నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు






