- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రంగు మురళి గౌడ్*\
కొరిపల్లి గ్రామ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రంగు మురళి గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దిశ, పెద్దవంగర ప్రతినిధి : కొరిపల్లి గ్రామ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రంగు మురళి గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా నాయకులు దంతాలపల్లి రవి, సంకెపల్లి రవీందర్ రెడ్డి, దుంపల శ్యామ్, పూర్ణచందర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు హరికృష్ణ తదితరులు రంగు మురళి గౌడ్‌కు శాలువా కప్పి సన్మానించి బాధ్యతలు అప్పగించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన రంగు మురళి గౌడ్, తనను మండల అధ్యక్షుడిగా నియమించిన పార్టీ అధిష్ఠానానికి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వర్తించి మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. సీనియర్ నాయకులను గౌరవిస్తూ, యువతకు ప్రాధాన్యం ఇస్తూ, అంతర్గత విభేదాలకు తావులేకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి మార్గనిర్దేశకుడిగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






