ఖనిజాలు అధిక లోడ్ తో రవాణా చేసే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోండి

by Taduka Kalyani |

ఖనిజాలను అధిక లోడులతో రవాణా చేసే వాహనాలపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశించారు.

ఖనిజాలు అధిక లోడ్ తో రవాణా చేసే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోండి
X

దిశ, ఆర్మూర్ : ఖనిజాలను అధిక లోడులతో రవాణా చేసే వాహనాలపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశించారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రానికి వచ్చిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసి, జిల్లాలో రవాణా శాఖ అమలు చేస్తున్న రోడ్డు భద్రత, అమలు కార్యక్రమాలపై అధికారులు వివరించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడారు. అధిక లోడుతో నడిచే వాహనాల వల్ల రహదారులు దెబ్బతినడంతో పాటు రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారులు, పోలీసు శాఖ, సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకొని జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి, ఓవర్‌లోడ్ మినరల్ వాహనాలపై నిరంతర తనిఖీలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ డిటిసి దుర్గ ప్రమీల, డి టి ఓ రమేష్ రాథోడ్,ఆర్మూర్ ఎంవిఐ రాహుల్ కుమార్, జిల్లాలోని ఎంవిఐ లు,అసిస్టెంట్ ఎంవిఐ లు, ఆర్టిఏ నెంబర్ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story