- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాత్కాలిక మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
హైవేల నిర్వహణలో నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.

దిశ, కొత్తగూడెం టౌన్: హైవేల నిర్వహణలో నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రామవరం గోధుమవాగు బ్రిడ్జి పై తీవ్రంగా ఏర్పడిన పెద్ద పెద్ద గుంతల తాత్కాలిక మరమ్మతు పనులను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించి, పనుల తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బ్రిడ్జీపై ప్రమాదకరంగా మారిన గుంతల పట్ల నేషనల్ హైవే అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం వెంటనే స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాల్సిన నేషనల్ హైవే అథారిటీ పూర్తిగా పట్టించుకోకపోవడం వల్లే, నిత్యం ప్రయాణించే వాహనదారుల ఇబ్బందులను, ప్రాణాపాయ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలోనే ఈ గుంతల పూడ్చే పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. యుద్ధప్రాతిపదికన ఈ తాత్కాలిక మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిలిచిపోయిన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంటనే పునరుద్దరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి, తమ పరిధిలోని రోడ్డుపై ఉన్న గుంతలను శాశ్వత ప్రాతిపదికన పూడ్చి వాహనదారుల ఇబ్బందులను, సమస్యలను శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ఇప్పటికె వివిధ పథకాలలో మంజూరైన నిధులతో రోడ్లు, వంతెనలు, అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, కమిషనర్ సుజాత, కార్పొరేటర్లు కూరపాటి సుధాకర్, నాయకులు భూక్యా శ్రీనివాస్, నగేష్, మున్సిపల్ ఏఈ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.






