రాష్ట్రంలోని అన్నదాతలకు ఊరట.. రాగల 4 రోజులు భారీ వర్ష సూచన!

by Kema Shiva Kumar |

తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది.

రాష్ట్రంలోని అన్నదాతలకు ఊరట.. రాగల 4 రోజులు భారీ వర్ష సూచన!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా రాగల నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలివేగం గంటకు 40 నుండి 50 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దక్షిణ మధ్య మధ్యప్రదేశ్ నుండి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు సముద్ర మట్టానికి 4.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం బలహీనపడిన కారణంగా వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈ నెల 4న బలమైన ఉపరితల గాలులు ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో వీచే అవకాశం ఉందని తెలిపింది.

రామగుండంలో దంచికొట్టిన వర్షం..

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 5 సెం.మీ., మెదక్ జిల్లా చేగుంటలో 5 సెం.మీ., ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో 5 సెం.మీ., ఆదిలాబాద్ జిల్లా బజార్ హథ్నూర్‌లో 4 సెం.మీ., జగిత్యాల జిల్లా పెగడపల్లిలో 4 సెం.మీ., మల్యాలలో 4 సెం.మీ., జైపూర్‌లో 4 సెం.మీ., మంచిర్యాల జిల్లా జన్నారంలో 3 సెం.మీ., పెద్దపల్లి జిల్లా ధర్మారంలో 3 సెం.మీ., కునారంలో 3 సెం.మీ., మంథనిలో 3 సెం.మీ., నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 3 సెం.మీ., మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 3 సెం.మీ., రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో 3 సెం.మీ., నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చందాలో 3 సెం.మీ., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 3 సెం.మీ., చంద్రుగొండలో 3 సెం.మీ., కరీంనగర్ జిల్లా గంగాధరలో 3 సెం.మీ., ఆదిలాబాద్ జిల్లా దిలావర్‌పూర్‌లో 3 సెం.మీ., సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో 3 సెం.మీ., ఆదిలాబాద్ జిల్లా తంసీలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

Next Story