- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గద్వాలలో డ్రగ్స్ కలకలం
జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గద్వాల పట్టణంలో పోలీసులు బుధవారం ఆకస్మికంగా ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం కింద యూరిన్ పరీక్షలు నిర్వహించారు.

దిశ, గద్వాల క్రైమ్: జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గద్వాల పట్టణంలో పోలీసులు బుధవారం ఆకస్మికంగా ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం కింద యూరిన్ పరీక్షలు నిర్వహించారు. గద్వాల సీఐ టంగుటూరి శ్రీను పర్యవేక్షణలో, ఎస్సై కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో అనుమానితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి డ్రగ్స్ వినియోగ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్షల్లో ఒక వ్యక్తికి మాదకద్రవ్యాల వినియోగం నిర్ధారణ కావడంతో అతనిపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ టంగుటూరి శ్రీను మాట్లాడుతూ, జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ముందస్తు సమాచారం లేకుండానే ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ, డ్రగ్స్ విక్రయం లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






