విద్యుత్ ఘాతంతో రెండు గేదెల మృతి

by Ratna Kumari |

నాగర్‌కర్నూల్ మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి రెండు గేదెలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

విద్యుత్ ఘాతంతో రెండు గేదెల మృతి
X

దిశ, నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి రెండు గేదెలు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని బాధిత రైతు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి గ్రామానికి చెందిన నీలంరెడ్డి పొలంలో పెద్దాపూర్ గ్రామానికి చెందిన సాకలి తిరుపతయ్యకు చెందిన రెండు గేదెలు మేత మేస్తుండగా, చేతికందే ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. విద్యుత్ లైన్‌మెన్, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధిత రైతు ఆరోపించారు. మృతి చెందిన రెండు గేదెల విలువ సుమారు రూ.1.20 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై బాధ్యులైన విద్యుత్ శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని బాధిత రైతు, గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Next Story