- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెబ్బెనలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
by Batti.Sumithra |
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

X
దిశ, రెబ్బెన : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. రెబ్బెన మండలానికి మంజూరైన 76 కళ్యాణ లక్ష్మి, 2 షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్లే అనిల్, జిల్లా ఆర్‌టీఏ సభ్యుడు రమేష్, పీఏసీఎస్ చైర్మన్ కర్నాతం సంజీవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రంగు మహేష్, రెబ్బెన సర్పంచ్ దుర్గం భరద్వాజ్, తహసీల్దార్ సూర్యప్రకాశ్, డిప్యూటీ తహసీల్దార్ లలిత, మండలంలోని వివిధ గ్రామపంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






