- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణా సరిహద్దులో దారుణం..దొంగతనం ఒప్పుకోమని...బాలిక చేతులపై వాతలు
తెలంగాణ సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై అమానుష ఘటన వెలుగుచూసింది.

దిశ, భద్రాచలం:: తెలంగాణ సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై అమానుష ఘటన వెలుగుచూసింది. రూ.10 వేల నగదు దొంగతనం చేసిందంటూ ఆరోపిస్తూ బాలికనుస్టవ్ పై అట్లా పుల్ల వేడి చేసి వాతలు పెట్టి, కత్తితో బెదిరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జీకే వీధి మండలం దారకొండ గ్రామానికి చెందిన ఓ చర్చి పాస్టర్ ఇంట్లో రూ.10 వేల నగదు కనిపించకుండా పోయింది. తండ్రి లేని వసంత (9) అనే గిరిజన బాలికను పాస్టర్ జయరాజు తన వద్ద ఉంచుకుని స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదివిస్తున్నాడు. నగదు కనిపించకుండా పోవడంతో బాలికపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చర్చికి వచ్చే రూపవతి అనే మహిళ బాలికను తన ఇంటికి తీసుకెళ్లి, పాస్టర్ జయరాజు, ఆయన భార్య సమక్షంలో దొంగతనం ఒప్పుకోవాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో స్టవ్‌పై వేడి చేసిన ఇనుప రాడ్‌తో బాలికకు వాతలు పెట్టి, మెడకు కత్తి ఆనించి బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన జూన్ 26న జరిగినప్పటికీ, బాలికను బెదిరించి విషయం బయటకు రాకుండా చేసినట్లు సమాచారం. మంగళవారం గిరిజన సంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.






