- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gymkhana Club: జింఖానా క్లబ్ వెంటనే ఖాళీ చేయండి.. కేంద్రం నోటీసులు
ప్రఖ్యాత జింఖానా క్లబ్‌ను తక్షణమే ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎవిక్షన్ (Eviction of Unauthorized Occupants) నోటీసులు జారీ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధానిలోని ప్రఖ్యాత జింఖానా క్లబ్‌ను తక్షణమే ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎవిక్షన్ (Eviction of Unauthorized Occupants) నోటీసులు జారీ చేసింది. అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఉన్న ఈ భూమిని దేశ భద్రత, రక్షణ మౌలిక సదుపాయాలు, ప్రజా ప్రయోజనాల నిమిత్తం వినియోగించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
ఆక్రమణగా గుర్తింపు..
1928లో ఈ స్థలాన్ని క్లబ్‌కు శాశ్వత లీజుకు ఇచ్చినప్పటికీ, ఒప్పందంలోని క్లాజ్ 4 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే పూర్తి హక్కు ప్రభుత్వానికి ఉందని నోటీసుల్లో పేర్కొంది. లీజు రద్దు చేసిన తర్వాత కూడా స్థలాన్ని ఖాళీ చేయకపోవడం 1971 చట్టం ప్రకారం చట్టవిరుద్ధమని, ఇది ఆక్రమణ కిందకే వస్తుందని తేల్చి చెప్పింది.
కోర్టులో దక్కని ఊరట
కేంద్రం ఆదేశాలను సవాల్ చేస్తూ క్లబ్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం వారికి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 7కు వాయిదా వేసింది.






