- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ESCI : ‘ఇస్కీ’ నూతన డైరెక్టర్‌గా కల్నల్ హెచ్.ఎస్. గ్రేవాల్
గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఇస్కీ - ESCI) నూతన డైరెక్టర్‌గా కల్నల్ హెచ్.ఎస్. గ్రేవాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఇస్కీ - ESCI) నూతన డైరెక్టర్‌గా కల్నల్ హెచ్.ఎస్. గ్రేవాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. భారత సైన్యంతో పాటు పలు కార్పొరేట్ సంస్థల్లో పనిచేసిన ఆయనకు సుమారు 38 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఐఐటీ రూర్కీ నుంచి కమ్యూనికేషన్ సిస్టమ్ టెక్నాలజీస్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. పరిపాలన, కమ్యూనికేషన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ రంగాల్లో ఆయనకు అపార నైపుణ్యం ఉంది. భారత సైన్యంలో ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ యూనిట్‌తో పాటు, ఎన్‌సీసీ గ్రూప్ హెడ్‌క్వార్టర్స్‌కు కమాండర్‌గా విశేష సేవలందించారు.
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్.. పురస్కారాలు
విధి నిర్వహణలో ఆయన చూపిన ప్రతిభకు గాను ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్’ ప్రశంసా పత్రం, పలు కమెండేషన్ కార్డులతో పాటు ప్రతిష్టాత్మక ‘ఇండియా అచీవర్స్ అవార్డు’ వరించాయి. సాఫ్ట్‌వేర్ డిఫైండ్ రేడియోలు, నెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్స్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలపై జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అనేక పరిశోధనా పత్రాలను సమర్పించారు. క్రీడల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉన్న కల్నల్ గ్రేవాల్‌కు హాకీ, క్రికెట్, గోల్ఫ్ అంటే ఎంతో ఇష్టం.






