ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు.. బొబ్బిలి సీఐపై సరూర్‌నగర్ పీఎస్‌లో FIR

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-01 17:07:56  IST  )

ఏపీ పోలీసులపై హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో తాజాగా కేసు నమోదైంది.

ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు.. బొబ్బిలి సీఐపై సరూర్‌నగర్ పీఎస్‌లో FIR
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు కావడం రెండు రాష్ట్రాల పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఏపీకి చెందిన ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI)పై హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వివరాల్లోకి వెళితే.. సీనియర్ జర్నలిస్టు కే.వెంకట్రాంరెడ్డి భార్య విజయలక్ష్మీ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. విజయలక్ష్మీ తన ఫిర్యాదులో ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస రావు తన పట్ల అత్యంత అనుచితంగా, అమానుషంగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు. చట్టాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉన్న ఓ బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి, మహిళ అని కూడా చూడకుండా తన పట్ల అమర్యాదగా ప్రవర్తించిన తీరుపై ఆమె సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన సరూర్‌నగర్ పోలీసులు..

అయితే, కే.వెంకట్రాం రెడ్డి భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సరూర్‌నగర్ పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. అనంతరం బొబ్బిలి సీఐ శ్రీనివాస రావుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓ రాష్ట్రానికి చెందిన పోలీస్ అధికారిపై పొరుగు రాష్ట్రంలో కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై సరూర్‌నగర్ పోలీసులు తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story