- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృద్ధురాలి మెడలో బంగారం చోరీ
by Taduka Kalyani |
కొణిజర్ల మండల పరిధిలోని రాజ్య తండా గ్రామ సమీపంలో వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు అపహరించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.

X
దిశ, కొణిజర్ల, జూలై 1: కొణిజర్ల మండల పరిధిలోని రాజ్య తండా గ్రామ సమీపంలో వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు అపహరించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ సూరజ్ తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపాలెం మండలం వీ. వెంకటాయపాలెం గ్రామానికి చెందిన తేజావత్ లక్ష్మి (68) అమ్మపాలెం సమీపంలోని తన పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా, హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు నాన్‌తాడు, నల్లపూసల గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించారు. వృద్ధురాలు ప్రతిఘటించినప్పటికీ, దుండగులు బలవంతంగా బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యారు. చోరీకి గురైన బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సూరజ్ తెలిపారు.
Next Story






