మఠంపల్లి ఎంపీడీవో గా డి. సుమంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ..

by Taduka Kalyani |

మఠంపల్లి మండల నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా డి. సుమంత్ రెడ్డి బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

మఠంపల్లి ఎంపీడీవో గా డి. సుమంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ..
X

దిశ, మఠంపల్లి: మఠంపల్లి మండల నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా డి. సుమంత్ రెడ్డి బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ ఎంపీడీఓగా విధులు నిర్వహించిన బి. ఉమ మహేశ్వర్ పదవీ విరమణ చేయడంతో, ప్రస్తుతం హుజూర్‌నగర్ మండలంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న డి. సుమంత్ రెడ్డి కి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మఠంపల్లి మండలానికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతరం మండలంలోని 29 గ్రామ పంచాయతీల కార్యదర్శులు నూతన ఎంపీడీఓ కు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పెదవీడు గ్రామ సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన డి. సుమంత్ రెడ్డి, ప్రజలకు పారదర్శకమైన పరిపాలన అందించడంతో పాటు మండల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు కృషి చేస్తానన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజల సహకారంతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి పని చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ నవీన్, సూపరింటెండెంట్ కృష్ణవేణి, సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, పెదవీడు 5వ వార్డు సభ్యుడు తెల్లబాటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Next Story