హారర్‌కు కొత్త టచ్.. 'నిమ్మకాయ… కెందుకు భయం' షూటింగ్ ప్రారంభం

by Batti.Sumithra |

వినూత్న కథలు, నూతన ఆలోచనలతో రూపొందుతున్న చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు.

హారర్‌కు కొత్త టచ్.. నిమ్మకాయ… కెందుకు భయం షూటింగ్ ప్రారంభం
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : వినూత్న కథలు, నూతన ఆలోచనలతో రూపొందుతున్న చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఈ మేరకు బుధవారం యూసుఫ్ గూడ సారధి స్టూడియోలో ’’నిమ్మకాయ…కెందుకు భయం” చిత్ర షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉప్పల శ్రీనివాస్ చిత్ర యూనిట్ హీరో సుమన్, డైరెక్టర్ డీఎస్ రెడ్డి, నిర్మాత చౌదరి, హీరో భూపతి, హీరోయిన్ స్వప్నలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమల అడవిలోని భవనంలో నిధి వుంటుందని, నిమ్మకాయ ఇతివృత్తంగా భయంకర దృశ్యాలతో, నాణ్యమైన నిర్మాణ విలువలతో ప్రతిభావంతులైన నటీనటులతో సినిమా రూపొందుతుందని, ఈ చిత్రం తప్పకుండా విజయవంతమవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సినీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. హీరో సుమన్ మాట్లాడుతూ చిత్రనిర్మాతలు, దర్శకుడు, నటీనటులు, సాంకేతిక బృందం అంకితభావంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని పేర్కొంటూ, వారి కృషి ఫలించి ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, సత్యనారాయణ, చిత్ర యూనిట్ సభ్యులు, సినీ ప్రముఖులు, ప్రత్యేక ఆహ్వానితులు తదితరులు పాల్గొన్నారు.

Next Story