- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగర్‌కర్నూల్ జిల్లాలో పిచ్చికుక్క స్వైరవిహారం
by Ratna Kumari |
నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామంలో బుధవారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం సృష్టించి చిన్నారులు, మహిళలు, వృద్ధులు సహా సుమారు 10 మందిపై దాడి చేసి కరిచింది.

X
దిశ, నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామంలో బుధవారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం సృష్టించి చిన్నారులు, మహిళలు, వృద్ధులు సహా సుమారు 10 మందిపై దాడి చేసి కరిచింది. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే తెలకపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించి రేబీస్ వ్యాక్సిన్‌తో పాటు అవసరమైన చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితులను నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పిచ్చికుక్క సంచారంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకుని వీధి కుక్కల నియంత్రణ చేపట్టాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
Next Story






