మృతి చెందిన ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన డీఆర్డీఏ అధికారి

by Ratna Kumari |

నర్వ మండలంలోని యాంకీ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు జజ్జలి అంజన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అధికారి వెంకట్రాములు పరామర్శించారు.

మృతి చెందిన ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన డీఆర్డీఏ అధికారి
X

దిశ, నర్వ: నర్వ మండలంలోని యాంకీ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు జజ్జలి అంజన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అధికారి వెంకట్రాములు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా అంజన్న కుటుంబ సభ్యులను ఓదార్చిన వెంకట్రాములు, వారికి ధైర్యం చెప్పారు. ఉపాధి హామీ పథకంలో అంజన్న అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ, ప్రభుత్వం తరఫున కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపీవో రాఘవేందర్, ఏపీవో గౌరీశంకర్ గౌడ్, గ్రామ సర్పంచ్ వెంకటేష్, టీఏ శ్రావణి, పీఎస్ అనురాధ, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story