- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ ఫక్కీలో ప్రమాదం.. బస్సు ఢీకొట్టడంతో బైక్‌పై పడిన ఆటో
అచ్చం సినిమా ఫక్కీలో తలపించే విధంగా తిరుమలాయపాలెం మండలం లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, తిరుమలాయపాలెం: అచ్చం సినిమా ఫక్కీలో తలపించే విధంగా తిరుమలాయపాలెం మండలం లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సుబ్లేడు గ్రామానికి చెందిన గడ్డం అనిల్ రెడ్డి (28) అనే యువకుడు బుధవారం మోటార్ సైకిల్ పై ఖమ్మం వెళుతున్నాడు. ఈ క్రమంలోనే పాత ఇనుము ట్రాలీ ఆటో అనిల్ రెడ్డి బైక్ ముందు వెళ్తుంది. అదే సమయానికి ఖమ్మం నుండి మరిపెడ బంగ్లా వైపుకు ఆర్టీసీ బస్సు వెళ్తుంది. మార్గం మధ్య కొక్కిరేణి డొంక, హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే, బంగ్లా వైపు వెళ్తున్న బస్సు, ఖమ్మం వైపు వెళ్తున్న ట్రాలీ ఆటో రెండు ప్రమాదవశాత్తు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ప్రమాదం దాటికి నుజ్జునుజ్జయిన ఆటో పైకి గాల్లోకి ఎగిరి వెనకాల వస్తున్న అనిల్ రెడ్డి బైక్ పై పడింది. ఒళ్ళు గుగ్గురు పొడిచేలా ఉన్న ఈ భయానక ప్రమాదంలో అనిల్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలు అయినట్లు తెలుస్తుంది. ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.






