నిశ్శబ్ద సేవకులకు దక్కిన గౌరవం.. పోస్టల్ వర్కర్లకు ‘స్కై ఫౌండేషన్’ ఘన సత్కారం

by Ramesh Naini |

పోస్టల్ వర్కర్ డే సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని పోస్టల్ ఉద్యోగులకు అరుదైన గౌరవం దక్కింది.

నిశ్శబ్ద సేవకులకు దక్కిన గౌరవం.. పోస్టల్ వర్కర్లకు ‘స్కై ఫౌండేషన్’ ఘన సత్కారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోస్టల్ వర్కర్ డే సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని పోస్టల్ ఉద్యోగులకు అరుదైన గౌరవం దక్కింది. సమాజానికి వారు అందిస్తున్న నిశ్శబ్ద సేవలను గుర్తిస్తూ ‘స్కై ఫౌండేషన్’, ‘స్కై కల్చరల్ అకాడమీ’ ఆధ్వర్యంలో పలువురు పోస్ట్ వర్కర్లను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్కై ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వై.సంజీవ కుమార్, ఉపాధ్యక్షురాలు ఓ.పావని మాట్లాడుతూ.. సమాజానికి ఎంతో కష్టపడి నిరంతరం సేవలందిస్తున్న పోస్టల్ ఉద్యోగుల సేవలను గుర్తించి, వారిని ప్రోత్సహించాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం పోస్టల్ సిబ్బంది జి.దివ్య జ్యోతి, జి.శిల్ప, సృజన, ఆర్.రాజారావు, డి.సుధాకర్, ఎన్.సురేష్, భూక్యా రాజ్యనాయక్, భమాణనాయక్, పి.రాఘవేందర్, ఎం.వెంకటేష్, డి.గొంగరాజు, బి.నర్సిములు, షేక్ జహంగీర్ అలీ తదితరులను సర్టిఫికెట్లతో ఘనంగా సత్కరించారు.

ఉద్యోగుల హర్షం..

ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తమ సేవలను ఈ విధంగా గుర్తించి సత్కరించిన సందర్భం లేదని ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారిగా స్కై ఫౌండేషన్ తమ కష్టాన్ని గుర్తించి గౌరవించడం సంతోషంగా ఉందని, ఈ సత్కారం తమ జీవితంలో చిరస్మరణీయమైన మధురస్మృతిగా నిలిచిపోతుందని కృతజ్ఞతలు తెలిపారు.

Next Story