- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహన్ యాక్టింగ్ నాకు స్ఫూర్తి నిచ్చింది.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్ వైరల్
ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాబోతున్న లేటెస్ట్ చిల్డ్రన్ మూవీ ‘సమ్మర్ హాలిడేస్’.

దిశ, సినిమా : ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాబోతున్న లేటెస్ట్ చిల్డ్రన్ మూవీ ‘సమ్మర్ హాలిడేస్’. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. తాజాగా ఇందులో నుంచి ‘క్రష్ సాంగ్’ను హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ ఆదిత్య హాసన్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో లాంఛ్ చేశారు.
ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా టీజర్ చూసినప్పుడు ఎమోషనల్ ఫీల్‌తో పాటు ఆనందభాష్పాలు కూడా వచ్చాయి. ఒక మంచి మూవీ చేశారని అప్పుడే అనిపించింది. ఈ సినిమా టీమ్‌లోని వాళ్లతో నాకు ఏదో ఒక అటాచ్ మెంట్ ఉంది. 90 వెబ్ సిరీస్‌లో రోహన్ సూపర్బ్‌గా యాక్ట్ చేశాడు. నేను అతని క్యారెక్టర్ పెద్దయ్యి విదేశాలకు వెళ్లి చదువుకుంటే ఎలా ఉంటుంది అనే పాయింట్‌తో ఎపిక్ మూవీ చేస్తున్నా. రోహన్ యాక్టింగ్ ఎపిక్ మూవీలో నటించడానికి నాకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ చిత్రంలోని పిల్లల నటన చూసి మరింతమందికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుందని ఆశిస్తున్నా. డైరెక్టర్ శ్రీకర్ మంచి సబ్జెక్ట్‌తో సినిమా చేస్తున్నారు. సమ్మర్ హాలీడేస్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు.






