- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలుష్య కట్టడికి శాశ్వత మాస్టర్ ప్లాన్.. నవంబర్ 1 నుంచి కఠిన నిబంధనలు
దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలంలో పెరిగిపోయే కాలుష్యాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలంలో పెరిగిపోయే కాలుష్యాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య నియంత్రణ కోసం శాశ్వత మాస్టర్ ప్లాన్‌ను నోటిఫై చేసింది. దీని ప్రకారం, ప్రతి ఏటా నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు నగరంలో కఠిన నిబంధనలు అమలులోకి వస్తాయి. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. సరైన పొల్యూషన్ (PUC) సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయరు. ఈ నిబంధన ఏడాది పొడవునా అమల్లో ఉంటుంది. నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు ఎలాంటి భవన కూల్చివేతలు, కొత్త సివిల్ నిర్మాణ పనులకు అనుమతి ఉండదు.
వర్క్ ఫ్రమ్ హోమ్..
ప్రయాణాలను తగ్గించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తారు. ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించడానికి నవంబర్ 1 నుంచి వాహనాల పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు చేయనున్నారు. ఢిల్లీని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజ్ఞప్తి చేశారు. ఈ నిబంధనలు ప్రతి ఏటా కచ్చితంగా అమలవుతాయని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది.






