- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇడుపు కాయితం’ మీద ఎందుకింత రచ్చ.. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి
తెలంగాణ భాష, సంస్కృతిపై ఆంధ్రోళ్ల పెత్తనం నడుస్తోందని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రోళ్లు తెలంగాణ భాష మీద, ఆలోచనలు, సంస్కృతి మీద పెత్తనం చేస్తున్నారని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి (Pasham Yadagiri) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇడుపు కాయితం’ పదం మీద ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. గతంలో ‘బలగం’ సినిమాలో మూలుగ బొక్క కోసం కొట్లాడితే.. దాని కోసం అలా కొట్లాడుతారా అని సోషల్ మీడియాలో అవహేళన చేస్తూ రచ్చ చేశారని ఫైర్ అయ్యారు. అంతెందుకు కేరళ వాళ్లు ఒకసారి పెళ్లిలో పాపడ్ కోసం కొడితే గొడవలు అయ్యాయని గుర్తు చేశారు. కేవలం పాపడ్ కోసమే కొట్లాడితే మూలుగు బొక్క కోసం కొట్లాడరా అని అన్నారు. తమ భాషని, సంస్కృతిని ఆంధ్రోళ్లు ఎక్కిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ఆంధ్రవాళ్లకు బానిసగా మారిపోయడని.. అందుకే మాట్లాడటం లేదని పాశం యాదగిరి అన్నారు. తన భర్తని అరెస్ట్ చేయొద్దు అన్నందుకు జర్నలిస్ట్ భార్య నడుము మీద చెయ్యి వేసి ఏపీ పోలీసులు లాగడం దుర్మార్గమని దుమ్మెత్తిపోశారు. ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణ బిడ్డ మీద చేతులేస్తే సీఎం నోరు కూడా విప్పడం లేదన్నారు. ఓ తెలంగాణ జర్నలిస్టు అరెస్ట్ ఇంత తంతు జరిగితే.. ఏ ఒక్క పత్రికలో కూడా రాలేదని, అవన్ని సిగ్గులేని వాళ్ల చేతుల్లో ఉన్నాయని అన్నారు. అసలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాదని.. చంద్రబాబు నాయుడే అన్నట్లుగా ఉందని పాశం యాదగిరి కామెంట్ చేశారు.






