- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్వాక్రా మహిళలకు శుభవార్త.. యూనియన్ బ్యాంక్ కీలక ప్రకటన
స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళల ఆర్థిక సాధికారత దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం ఆదేశాలతో స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసే రుణాలపై విధించే ప్రాసెసింగ్ చార్జీలు, ఇన్‌స్పెక్షన్ చార్జీలను పూర్తిగా మినహాయిస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది...

దిశ, ఏపీ బ్యూరో: స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళల ఆర్థిక సాధికారత దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం ఆదేశాలతో స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసే రుణాలపై విధించే ప్రాసెసింగ్ చార్జీలు, ఇన్‌స్పెక్షన్ చార్జీలను పూర్తిగా మినహాయిస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ.10 లక్షలకు పైబడిన క్యాష్ క్రెడిట్ రుణాలపై ప్రతి లక్షకు రూ.350 చొప్పున ప్రాసెసింగ్ చార్జీ, రూ.5 లక్షలకు పైబడిన టర్మ్ లోన్ రుణాలపై 1.30 శాతం ప్రాసెసింగ్ చార్జీ విధించేవారు. అదనంగా రూ.5 లక్షలకు పైబడిన ప్రతి రుణ ఖాతాపై ప్రతి మూడు నెలలకు రూ.500తో పాటు జీఎస్టీని ఇన్‌స్పెక్షన్ చార్జీగా విధించేవారు. ఈ చార్జీల కారణంగా స్వయం సహాయక సంఘాలపై సుమారు ఒక శాతం వరకు అదనపు ఆర్థిక భారం పడుతుంది. మహిళలకు తక్కువ వ్యయంతో రుణాలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ప్రతికూలంగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించించింది. మహిళల సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ చార్జీలను పూర్తిగా మినహాయింపు ఇచ్చింది. దీంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యానికి మహిళా సంఘాల తరపున మంత్రి కొండపల్లి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
‘ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో 2,50,255 స్వయం సహాయక సంఘాలకు రూ.20,359 కోట్లకు పైగా రుణాలు అందిస్తూ, ఎస్‌హెచ్‌జీ రుణాల పంపిణీలో అగ్రస్థానంలో కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఈ చార్జీల మినహాయింపు వల్ల రూ. 20 లక్షల క్యాష్ క్రెడిట్ లోన్ తీసుకున్న ప్రతి సంఘానికి మూడేళ్లలో రూ. 93,500 వరకు ఆర్థిక లబ్ధి కలుగుతుందని..యూనియన్ బ్యాంక్ నుంచి లోను తీసుకున్న 1.75 లక్షల సంఘాలకు సంవత్సరానికి 586.25 కోట్ల లబ్ధి కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న "ఒక్కో కుటుంబం – ఒక్కో పారిశ్రామికవేత్త" లక్ష్య సాధనకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని మంత్రి కొండపల్లి పేర్కొన్నారు.






