విద్యుత్ షాక్‌తో పెళ్లింట విషాదం

by Ratna Kumari |

హనుమకొండ జిల్లా భీమారం ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై నవవరుడు, ఆయన తండ్రి మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

విద్యుత్ షాక్‌తో పెళ్లింట విషాదం
X

దిశ, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా భీమారం ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై నవవరుడు, ఆయన తండ్రి మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం ప్రకారం, ఇంటి అలంకరణ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్‌ను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లను తాకి సాంబయ్య (62) విద్యుదాఘాతానికి గురయ్యారు. తండ్రిని రక్షించేందుకు ప్రయత్నించిన కుమారుడు శరత్ (32) కూడా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు శరత్‌కు ఇటీవలే, జూన్ 24న వివాహం జరిగింది. ఆయన హైదరాబాద్‌లో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివాహ వేడుకలు ముగిసిన కొద్ది రోజులకే తండ్రి, కుమారుడు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story