న్యాయ సహాయం అందిస్తాం.. అండగా ఉంటాం: మాజీ సీఎం జగన్

by Vemula.Srinu Prasad |

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పని చేసిన కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులను తొలగించారు. వైద్యశాలకు ఇటీవల కొత్త కాంట్రాక్టర్‌ వచ్చారు. దీంతో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి దూరం చేశారు. ...

న్యాయ సహాయం అందిస్తాం.. అండగా ఉంటాం: మాజీ సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పని చేసిన కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులను తొలగించారు. వైద్యశాలకు ఇటీవల కొత్త కాంట్రాక్టర్‌ వచ్చారు. దీంతో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి దూరం చేశారు. దీంతో వారందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోతాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. తమకు న్యాయం చేసేలా ప్రభుత్వంపై పోరాటం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలుస్తుందని జగన్ భరోసా ఇచ్చారు. వారి ఉద్యోగాల పరిరక్షణ కోసం అవసరమైన న్యాయపరమైన సహాయాన్ని పార్టీ లీగల్‌ సెల్‌ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ అన్ని విధాలా తోడుగా ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story