- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి
జూలై 4న మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, మిడ్జిల్ : జూలై 4న మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మిడ్జిల్ మండల కేంద్రంలో సీఎం సభా స్థలం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, ధ్యాప గోపాల్ రెడ్డి విగ్రహాల దిమ్మెల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఏర్పాట్లను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2006లో మిడ్జిల్ మండలం నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగే ప్రయాణంలో మిడ్జిల్ మండల ప్రజల ఆదరణ, ఆశీర్వాదాలు కీలక పాత్ర పోషించాయని ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో స్వయంగా పేర్కొన్నారని తెలిపారు. మిడ్జిల్ ప్రజలపై ఉన్న కృతజ్ఞతాభావంతోనే ముఖ్యమంత్రి జూలై 4న మండల కేంద్రానికి విచ్చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఉమ్మడి మిడ్జిల్ మండల అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు మంజూరు చేయడంతో పాటు పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జూలై 4న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






