- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల్లో శాస్త్ర చైతన్యం పెంపొందించాలి: ఇస్రో మాజీ శాస్త్రవేత్త
విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి, శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు సింగరేణి ఏయిడెడ్ హైస్కూల్‌లో 9వ, 10వ తరగతి విద్యార్థులకు బుధవారం "అంతరిక్ష విజ్ఞానం" అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

దిశ, ఇల్లెందు: విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి, శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు సింగరేణి ఏయిడెడ్ హైస్కూల్‌లో 9వ, 10వ తరగతి విద్యార్థులకు బుధవారం "అంతరిక్ష విజ్ఞానం" అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. పూల్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇస్రో మాజీ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్, మాజీ శాస్త్రవేత్త గంగి వెంకట నారాయణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత అంతరిక్ష ప్రయాణం ప్రారంభ దశ నుంచి ఇప్పటివరకు సాధించిన విజయాలను వివరించారు. ఉపగ్రహాల వినియోగం, చంద్రయాన్, గగన్‌యాన్ వంటి ప్రతిష్ఠాత్మక అంతరిక్ష కార్యక్రమాల విశేషాలను వివరించడంతో పాటు, భవిష్యత్తులో అంతరిక్ష రంగంలో ఉన్న అవకాశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. శాస్త్ర–సాంకేతిక రంగంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన శాస్త్రీయ సూత్రాలు, ఆధునిక సాంకేతికత, అంతరిక్ష పరిశోధనల ప్రాముఖ్యతను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు. విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై చైతన్యం పెంపొందించడంతో పాటు అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కల్పించడంలో ఈ సదస్సు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి. రవీందర్, ఎ. శ్రీనివాస్, డి. తిరుపతితో పాటు ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






