- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సేవా కార్యక్రమాలలో ఎస్‌బీఐ ముందంజ
సేవా కార్యక్రమాలలో ఎస్‌బీఐ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని ఆ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) నీలేష్ ద్వివేది అన్నారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో: సేవా కార్యక్రమాలలో ఎస్‌బీఐ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని ఆ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) నీలేష్ ద్వివేది అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో 71వ బ్యాంక్ దినోత్సవాన్ని బుధవారం కోఠిలోని బ్యాంక్ స్థానిక ప్రధాన కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. బ్యాంక్ సుస్థిరతను ప్రోత్సహించేందుకు 71వ బ్యాంక్ దినోత్సవ ప్రతిజ్ఞను సామూహికంగా పఠించారు. అనంతరం సీఎస్‌ఆర్‌లో భాగంగా సికింద్రాబాద్ సాధన ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ విద్యార్థులకు ఒక ప్రత్యేక మినీ వ్యాన్‌ను నిర్వాహకులు మధుసూదన్ రెడ్డికి, దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌కు 52 సీట్ల బస్సును చైర్‌పర్సన్ డాక్టర్ జి.ఎల్.కె. దుర్గా, ప్రిన్సిపాల్ శ్రావ్య స్పందనలకు విరాళంగా అందించారు.
అంతే కాకుండా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశిష్ట సేవలందిస్తున్న పదకొండు మంది అంకితభావం గల బ్యాంక్ మెడికల్ ఆఫీసర్లు, నిపుణులను, ఆరోగ్య సంరక్షణ సలహాదారులను, ప్రముఖ ఆడిటర్లు సీఎస్ఆర్.మూర్తి, డి. విజయ్ కుమార్‌లను నీలేష్ ద్వివేది సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎస్‌ఆర్ కింద బ్యాంక్ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ మేనేజ్‌మెంట్ కమిటీ జనరల్ మేనేజర్లు సతీష్ కుమార్ (నెట్‌వర్క్–II), రణ్‌విజయ్ ప్రతాప్ (నెట్‌వర్క్–I), ఆర్. గణేష్ (సీసీజీఆర్ఓ), డీజీఎం, సీడీఓ సురజిత్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.






