- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SIR ప్రక్రియపై ఎన్నో అనుమానాలున్నాయి.. మాజీ మంత్రి కేటీఆర్ కీలక డిమాండ్
ఎస్ఐఆర్ విషయంలో సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు, ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయని, వీటన్నింటికీ ఈసీ తుది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగిందని కేటీఆర్ అన్నారు.
ఎస్ఐఆర్ విషయంలో సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుందని కేటీఆర్ గుర్తు చేశారు. కాబట్టి, కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఎస్ఐఆర్‌పై పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. తెలంగాణలో ఎన్నికల సంస్కరణలు, నియోజకవర్గాల ప్రక్రియకు సంబంధించి భవిష్యత్తులో ఏం జరిగినా.. అది అత్యంత పారదర్శకంగా, సరైన పద్ధతిలో జరుగుతుందని తాను ఆశిస్తున్నానని, ప్రజాస్వామ్య పద్ధతులకు లోబడే రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.






