జమ్మలమడుగులో ఉద్రిక్తత.. పోలీసులతో వైసీపీ నేతల వాగ్వాదం

by Vemula.Srinu Prasad |

కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ సందర్శనకు బయల్దేరిన వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ ర్యాలీకి అనుమతి లేదంటూ చెప్పారు. దీంతో పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది...

జమ్మలమడుగులో ఉద్రిక్తత.. పోలీసులతో వైసీపీ నేతల వాగ్వాదం
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District) జమ్మలమడుగు(Jammalamadugu)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ(Jindal Steel Factory) సందర్శనకు బయల్దేరిన వైసీపీ(Ycp) శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ ర్యాలీకి అనుమతి లేదంటూ చెప్పారు. దీంతో పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. జిందాల్ స్టీల్ ప్లాంట్ వద్దకు వెళ్లనివ్వలేదు. దీంతో పోలీసులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తమను స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలంచకుండా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కావాలనే పోలీసులను అడ్డుపెట్టుకుని తమ ర్యాలీని అడ్డుకున్నారని వైసీపీ నేతలు రవీంధ్రనాథ్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, రఘురామరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్‌ను పరిశీలిస్తామని హెచ్చరించారు. కాగా జింథాల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ నిర్మాణాలపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా స్టీల్ ప్లాంట్ సందర్శనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ నేతలు నిరాశ వ్యక్తం చేశారు.

Next Story