- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: భార్య లావుగా ఉందని ఘాతుకం.. గుంతునులిమి సైలెంట్‌గా చంపిన భర్త
కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ జిల్లాలో దారుణం జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్‌ల వేళ దేశవ్యాప్తంగా కట్టుకోబోయే మగాళ్లను అమ్మాయిలు తమ ప్రియులతో కలిసి హతమారుస్తున్న ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ, కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో మాత్రం రోటీన్‌కు భిన్నంగా ఓ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధార్వాడ్ (Dharwad) జిల్లాలో ఓ నర్సు ఇటీవల దారుణ హత్యకు గురైంది. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా, బాడీ షేమింగ్ చేస్తూ భర్త ఆమెను గొంతు నులిమి దారుణంగా హతమార్చాడు. చేశాడు. ఈ ఘోర ఘటన నవలగుండ్ తాలూకాలోని హనాసి గ్రామంలో వెలుగుచూసింది.
లావుగా ఉన్నావంటూ మెంటల్ టార్చర్..
అయితే, చనిపోయిన బాధితురాలు ప్రియాంక కమలాకర్ (29)గా పోలీసులు గుర్తించారు. వృత్తిరీత్యా స్టాఫ్ నర్సు అయిన ప్రియాంకకు, బసవరాజ్ వడ్డార్ (Basavaraju Vaddar) అనే వ్యక్తితో డిసెంబర్ 2024లో వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని వారాల నుంచే అదనపు కట్నం కోసం ప్రియాంకను భర్తతో పాటు అత్తమామలు రేణవ్వ, సుభాష్, సిద్ధరామేష్‌లు వేధించడం ప్రారంభించారు. కట్నం వేధింపులతో పాటు, ప్రియాంక శారీరాన్ని టార్గెట్‌గా చేసుకుని భర్త బసవరాజ్ నిరంతరం అవహేళన చేసేవాడు. ‘నువ్వు చాలా లావుగా ఉన్నావు, నువ్వు నాకు నచ్చలేదు, నీకు పిల్లలు పుట్టరు’ అంటూ తీవ్రంగా నిత్యం హింసించేవాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. పెళ్లయిన తర్వాత ప్రియాంక రెండుసార్లు గర్భం దాల్చినప్పటికీ, భర్త చేసిన విచక్షణారహిత భౌతిక దాడుల కారణంగా ఆమెకు రెండుసార్లు గర్భస్రావం (Miscarriage) అయింది.
అతి క్రూరంగా గొంతు నులిమి హత్య..
ఈ క్రమంలోనే సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కోపంతో ఊగిపోయిన బసవరాజ్.. ప్రియాంకను అతిక్రూరంగా మానవత్వం లేకుండా గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణం జరిగిన 2 రోజుల తర్వాత ఇవాళ విషయం వెలుగులోకి రావడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. ప్రియాంక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నవలగుండ్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన భర్త బసవరాజ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.






