కుంభమేళా రద్దీ మాటున కోట్లాది రూపాయలు సైడ్.. అయోధ్య విరాళ చోరీ కేసులో షాకింగ్ విషయాలు

by Prasad Jukanti |   (  Updated:2026-07-01 10:15:30  IST  )

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి.

కుంభమేళా రద్దీ మాటున కోట్లాది రూపాయలు సైడ్.. అయోధ్య విరాళ చోరీ కేసులో షాకింగ్ విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ చోరీ ఎలా జరిగింది? ఎలా జరిగింది? దీంట్లో ఇంకెవరెవరి పాత్ర ఉందన్న దానిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన సిట్‍కు విస్తుపోయే అంశాలు తారసపడుతున్నాయి. 2025 ప్రారంభంలో జరిగిన కుంభమేళా సమయంలోనే రామాలయంలో అత్యధిక మొత్తంలో నగదు చోరీకి గురైనట్లు తాజాగా అయోధ్య పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ భారీ దోపిడీ వెనుక ఒకరిద్దరు కాదు, ఏకంగా ఒక ముఠానే పనిచేసినట్లు SIT గుర్తించింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రమాశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ తిన్ను యాదవ్ అనే ఎనిమిది మంది నిందితులను సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వీరిని సుదీర్ఘంగా విచారించగా సంచలన విషయాలు బయపడినట్లు తెలుస్తోంది.

కుంభమేళా రద్దీని ఆసరగా చేసుకుని:

అరెస్ట్ అయిన నిందితుల్లో కొందరు కుంభమేళా కంటే ముందే గుడిలో చేతివాటం ప్రదర్శించేవారని పోలీసులు తెలిపారు. అయితే 2025 కుంభమేళా సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దాంతో ఆలయానికి వచ్చే కానుకలు, విరాళాలు సైతం అంతే స్థాయిలో పెరిగాయి. ఈ రద్ధీని ఆసరగా చేసుకున్న నిందితుడు పెద్ద ఎత్తున నగదును సైడ్ చేసేందుకు భారీ కుట్రకు తెరలేపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తం కుట్రలో బావమరుదులైన లవకుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అత్యధిక మొత్తంలో నగదును దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. చోరీకి పాల్పడిన సొమ్ముతో ఈ ఇద్దరూ పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశారని వీరికి సంబంధించిన అరడజన్‍కు పైగా ఆస్తులను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాల గుట్టు తేల్చేందుకు మరింత లోతైన దర్యాప్తుకోసం అయోధ్య పోలీసులు ఐటీ డిపార్ట్మెంట్ సహాయం తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కోసం ఈడీకి అధికారులు లేఖను సైతం రాయబోతున్న్టలు తెలుస్తోంది.

దుప్పట్లలో నగదు గుట్టలు:

రామాలయంలోని నాలుగు డొనేషన్ బాక్సెస్ నగదును లెక్కించే బాధ్యతను ఎస్బీఐ (SBI) ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా ఈ బ్యాంకుకు చెందిన 11 మంది సిబ్బంది, ఆలయ ట్రస్ట్‌కు చెందిన ముగ్గురు మొత్తం 14 మంది సభ్యుల బృందం ఈ లెక్కింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రక్రియలోనే కొంతమంది ఎస్బీఐ ఉద్యోగుల పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వద్ద డ్రైవర్‌గా పనిచేసిన తిన్ను యాదవ్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా నగదు పట్టుబడింది. అత్యధికంగా రూ.89 లక్షల నగదును నిందితుడు అవినాష్ శుక్లా ఇచ్చిన సమాచారం ఆధారంగా రికవరీ చేశారు. ఈ సొమ్మును అవినాష్ సోదరుడికి చెందిన ఒక యోగా కేంద్రంలో, నాలుగు బాక్సులలోని దుప్పట్ల (Blankets) మధ్య దాచి ఉంచగా జూన్ 5న పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. రాముడి సొమ్మును కాజేసిన ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

Next Story