- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు కూడా ఆ పార్టీని గొడ్డలిపార్టీ అనే పిలవండి: చంద్రబాబు
ప్రజలు కూడా వైసీపీని గొడ్డలిపార్టీ అనే పిలవాలని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లాలోని పొన్నపువారిపాలెంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక గొడ్డలిపార్టీ ఉందని, ప్రజలు కూడా దానిని అలాగే పిలవాలని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రజలు కూడా వైసీపీని గొడ్డలిపార్టీ అనే పిలవాలని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లాలోని పొన్నపువారిపాలెంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక గొడ్డలిపార్టీ ఉందని, ప్రజలు కూడా దానిని అలాగే పిలవాలని అన్నారు. రౌడీలతో రాజధాని రైతులపై దండయాత్రకు వెళ్లారని, రౌడీయింజం చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. 2029 తరవాత రాజధాని ఏది అంటే నవ్వుకునేవాళ్లు అని మూడు రాజధానులు అంటూ మూడు ముక్కల ఆట ఆడారని విమర్శించారు. అందరికీ రాజధాని కావాలని కానీ గొడ్డలిపార్టీకి అవసరంలేదని మండిపడ్డారు.
హోంమంత్రి అనితపై మేకప్ అంటూ కామెంట్లు చేస్తున్నారని, ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరిరోజు అవుతుందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. తప్పు కదా అంటే నా ఇష్టం అని అమర్నాథ్ అంటున్నారని మండిపడ్డారు. సాయికృష్ణ కేసులో పవన్ కల్యాణ్ ను తీసుకువచ్చారని, కుల రాజకీయాలు చేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్, ఆయన కూతుళ్లపైనా అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. బ్లేబ్ బ్యాచీలు, రౌడీలకు వైసీపీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు.






