- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లే లిస్ట్‌లే ప్రేమ లేఖలు.. జెన్ Z లవ్ లాంగ్వేజ్‌గా మ్యూజిక్!
నేరుగా భావాలు చెప్పడం కంటే లిరిక్స్ ద్వారా చెప్పడాన్ని జెన్ Z ఇష్టపడుతోంది.

దిశ, ఫీచర్స్ : నచ్చిన మ్యూజిక్(పాటలు) వినడం ఒకప్పుడు కేవలం వ్యక్తిగత ఆసక్తిగా ఉండేది. కానీ ఇప్పుడది జెన్ -Z మధ్య ఆధునిక ప్రేమ భాషగానూ మారుతోంది. వ్యక్తిత్వ వికాస నివేదికల్లోనూ, ఎమోషనల్ డైరీల్లోనూ స్థానం సంపాదించుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపేవాళ్లు, అంగీకరించేవాళ్లు కూడా ఇప్పుడు మ్యూజిక్ అభిరుచులను చూసి అవతలి వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే సంబంధాల్లో డేట్‌కు ముందు ఇన్‌స్టా్గ్రామ్ స్టాకింగ్ చేసేవాళ్లు సైతం ఇప్పుడు స్పాటిఫై ప్లేలిస్ట్‌లను చూసి అవతలి వ్యక్తిపై అంచనాకు వస్తున్నారంటే.. సంగీతం యువతరాన్ని ఎంతగా ఆకట్టుకుంటున్నదో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
మూడ్ బూస్టర్ అదే..
జెన్ -Zలో చాలామంది మ్యూజిక్‌ను పాజిటివ్ మూడ్ బూస్టర్‌గా భావిస్తున్నారు. రాత్రిపూట నిద్రరాకపోతే మీరెలాంటి పాటలు వింటున్నారు? ‘ఆన్ రిపీట్’లో ఏ పాటలున్నాయి? అని విశ్లేషించి, భావోద్వేగ స్థిరత్వం, హీలింగ్ ఫేజ్ లేదా హార్ట్‌బ్రేక్ వైబ్‌ను అంచనా వేస్తున్నారు. కొందరైతే కొత్తగా పరిచయమైన వ్యక్తులను లేదా సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ అడిగిన వారిని ‘సెండ్ మీ యువర్ ప్లేలిస్ట్’ అని మొహంమీదే అడిగేస్తున్నారు. నచ్చిన వ్యక్తికి లవ్ ప్రపోజ్ చేసే విషయంలోనూ వారి మ్యూజిక్ ఆసక్తులు, ప్లేలిస్ట్ తనిఖీలు ఒక భాగమైపోయాయి. అంటే ‘టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్’కి బదులుగా ఇప్పుడిదొక కొత్త ట్రెండ్ అన్నమాట.
తరాల మధ్య తేడా..!
అయితే మ్యూజిక్ పట్ల ఆసక్తి, అభిరుచి అనేది కేవలం ఈతరానికి సంబంధించిన కొత్త విషయం ఏమీ కాదు. కాకపోతే పాత తరాలు క్యాసెట్లు, సీడీల్లో దానిని ఆస్వాదించారు. కొందరైతే తమ ప్రేమపాటల్లోని పదాలను, వాక్యాలను కాగితాలపై రాస్తూ ప్రేమను వ్యక్తం చేసేవారు. ప్రతీ పాట వెనుచ ప్రతీ లిరిక్ వెనుక ఉద్దేశపూర్వక భావన కూడా ఉండేది. కానీ.. ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా యువతలో ఆలోచనలు, సంగీత ఆస్వాదనలు సైతం గత తరాలకు భిన్నంగా మారుతున్నాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ యాప్‌లు (స్పాటిఫై, యాపిల్ మ్యూజిక్ వంటివి) ద్వారా వాటిని ఆస్వాదిస్తున్నారు. నచ్చిన వ్యక్తికి సెకన్లలో లింక్ పంపేస్తున్నారు. షేర్డ్ ప్లేలిస్ట్‌లు, ‘కొలాబరేటివ్ లిజనింగ్’ ద్వారా ఆత్మీయత(Intimacy) పెరిగింది. జిమ్ మిక్స్ నుంచి సాఫ్ట్ ఇండీ, గజల్స్, బాలీవుడ్ హార్ట్‌బ్రేక్ పాటల వరకు.. ఆధునిక యువత నిజమైన నేడు ప్లేలిస్ట్‌లో నిక్షిప్తం అయి ఉంటున్నాయనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు అంటున్నారు ట్రెండ్ ఫాలోవర్స్. అందుకే ‘ప్లేలిస్ట్‌లు లో-కీ పర్సనాలిటీ రిపోర్ట్స్’ అని కూడా అంటున్నారు.
అభిప్రాయాల వ్యక్తీకరణలో
ఒకప్పుడు చూపుల ద్వారా మాత్రమే యువతీ యువకుల మధ్య ఫ్లర్టింగ్ స్టార్టయ్యేది కానీ.. ఇప్పుడు మ్యూజిక్ కూడా ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. సాంగ్ రికమెండేషన్స్ ద్వారా ప్రేమ వ్యక్తీకరణ జరుగుతోంది. నేరుగా భావాలు చెప్పడం కంటే లిరిక్స్ ద్వారా తమ మనసులోని మాటను చెప్పడం, సూచనలు ఇవ్వడం సులభంగా, సేఫ్‌గా భావిస్తున్నారు చాలామంది. అంతేకాదు ఇద్దరు ప్రేమికుల మధ్య బ్రేకప్ అయినా షేర్డ్ ప్లేలిస్ట్ డిలీట్ చేస్తున్నారు. అంటే దీని ద్వారా సంబంధం ముగిసినట్టు సంకేతం ఇస్తున్నారు. సైకాలజీ ఆఫ్ మ్యూజిక్ అధ్యయనాల ప్రకారం.. మ్యూజికల్ టేస్ట్.. అనేది వ్యక్తిత్వం, వాల్యూస్, కాంపాటిబిలిటీని చెబుతుంది. మెట్రోల్లో ఒంటరి ప్రయాణాలు, నిద్రలేని రాత్రులు, హార్ట్‌బ్రేక్ స్పైరల్స్‌లో కూడా జెన్ Z నిజమైన భావాలు పాటల రూపంలో వెల్లడవుతుంటాయి. ఈ ట్రెండ్ జెన్ Z డేటింగ్ సంస్కృతిని సైతం పూర్తిగా మార్చేసిందని నిపుణులు చెబుతున్నారు.






