- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొగ్గు బ్లాకుల కేటాయింపుతోనే సింగరేణికి భవిష్యత్తు
సింగరేణి సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాడిచెర్ల బొగ్గు బ్లాక్–II, మణుగూరు పీకే ఓసీ-II డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కే కేటాయించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ఏబికెఎంఎస్-బిఎంఎస్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అప్పాని శ్రీనివాస్, వడ్డేపల్లి కుమారస్వామిలు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి విన్నవించారు.

దిశ, యైటింక్లయిన్ కాలనీ : సింగరేణి సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాడిచెర్ల బొగ్గు బ్లాక్–II, మణుగూరు పీకే ఓసీ-II డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కే కేటాయించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ఏబికెఎంఎస్-బిఎంఎస్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అప్పాని శ్రీనివాస్, వడ్డేపల్లి కుమారస్వామిలు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి విన్నవించారు. ఈ సందర్బంగా ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఏబికెఎంఎస్-బిఎంఎస్ ప్రతినిధుల బృందంతో మర్యాదపూర్వకంగా కలిసి సమగ్ర వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ..ప్రస్తుతం సింగరేణిలోని పలు బొగ్గు గనుల్లో నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భవిష్యత్తులో గనులు మూతపడి, వేలాది మంది కార్మికుల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 492 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న తాడిచెర్ల బొగ్గు బ్లాక్–II లో సుమారు 277 మిలియన్ టన్నులు, మణుగూరు పీకే ఓసీ-II డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులో 215 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని వివరించారు. బొగ్గు తవ్వకాలలో సింగరేణికి ఉన్న అపార అనుభవం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ రెండు ప్రాజెక్టులను సంస్థకే కేటాయించాలన్నారు.
దీనివల్ల సంస్థ బలోపేతం కావడమే కాకుండా దేశీయ బొగ్గు ఉత్పత్తి పెరిగి, దిగుమతులు తగ్గుతాయని పేర్కొన్నారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కోల నుండి సింగరేణికి రావాల్సిన సుమారు రూ.56,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఇల్లందు ఏరియాలోని పూసపల్లి ఓసీ ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని, సింగరేణి, కోల్ ఇండియా కార్మికుల కోసం 12వ వేతన కమిటీ (JBCCI–XII)ని తక్షణమే ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నారు. కార్మిక సంఘం నాయకుల వినతి పై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి తాడిచెర్ల బ్లాక్-II, మణుగూరు ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులను సింగరేణికి కేటాయించే దిశగా త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ₹56,000 కోట్ల బకాయిల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనూ, సింగరేణి యాజమాన్యంతోనూ మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, 12వ వేతన కమిటీ ఏర్పాటు పై కోల్ ఇండియా అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.వినతి పత్రం అందించిన వారిలో ఏబికెఎంఎస్ జాతీయ నాయకులు మండా రమాకాంత్, పులి రాజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాధవ్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వై. సారంగపాణి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ జి.వి. కృష్ణారెడ్డి, సెంట్రల్ కోశాధికారి సాయివేణి సతీష్, ఆకుల హరిణ్ పటేల్, కర్రవుల మహేష్, నాయిని సైదులు, లీలా కృష్ణ, దశరథం, పి.శ్రీనివాస్, సత్కూరి శ్రీనివాస్, పందాల మల్లేష్, ఆర్. నర్సింగ రావు, రూపేశ్వరచారి తదితరులు ఉన్నారు.






