- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీ మహువా మొయిత్రాకు చేదు అనుభవం.. కోడిగుడ్లతో బీజేపీ శ్రేణుల దాడి! (వీడియో వైరల్)
బీజేపీ శ్రేణులు గుడ్లు, కూరగాయలతో తనపై దాడికి తెగబడ్డారని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మోయిత్రా (Mahua Moitra) కృష్ణానగర్‌లోని తన కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. ఇవాళ తన కార్యాలయం వెలుపల గుంపుగా వచ్చిన కొందరు వ్యక్తులు గుడ్లు, కూరగాయలు విసిరి దాడి చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు.
పోలీసులు చూస్తూ ఉండిపోయారు..
అయితే, దాడి జరుగుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ (CRPF) బలగాలు అక్కడ ఉన్నప్పటికీ కేవలం ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారని మహువా మోయిత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటకు పైగా తాను ఇక్కడే నిలబడ్డానని.. డీజీపీతో సహా అందరికీ ఫోన్ చేశానన్నారు. కానీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు మాత్రం పక్కనే కూర్చుని తమాషా చూస్తున్నాయని కామెంట్ చేశారు. ఇది తన నియోజకవర్గమని, ఇక్కడి ఎంపీని, తన ఆఫీస్ నుంచి కదిలేదే లేదని మహువా మోయిత్రా స్పష్టం చేశారు. రేపు బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనను పట్టించుకోదని, కోర్టులు కూడా సుమోటోగా స్వీకరించవంటూ ఆవేదన వ్యక్తం చేశారు.






