- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సీట్లు లేవు’.. సహకరించండి: హౌస్‌ఫుల్ బోర్డు పెట్టిన హైస్కూలు
సీట్లు లేవు.. హౌస్ ఫుల్ అయిందని ప్రైవేటు స్కూళ్ల వద్ద బోర్డులు చూస్తుంటాం. కానీ ఇప్పుడు కొన్ని ప్రభుత్వ బడుల వద్ద చూస్తున్నాం. ప్రభుత్వ హైస్కూళ్లలో కార్పొరేట్ స్థాయి వసతులు, అధునాతనమైన ల్యాబ్‌లు, అనుభవజ్ఞులైన టీచర్లు ఉండటంతో ప్రభుత్వ బడుల్లో తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ...

దిశ, వెబ్ డెస్క్: సీట్లు లేవు.. హౌస్ ఫుల్ అయిందని ప్రైవేటు స్కూళ్ల వద్ద బోర్డులు చూస్తుంటాం. కానీ ఇప్పుడు కొన్ని ప్రభుత్వ బడుల వద్ద చూస్తున్నాం. ప్రభుత్వ హైస్కూళ్లలో కార్పొరేట్ స్థాయి వసతులు, అధునాతనమైన ల్యాబ్‌లు, అనుభవజ్ఞులైన టీచర్లు ఉండటంతో ప్రభుత్వ బడుల్లో తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నాగరాజ ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు.
హైస్కూలుకు విద్యార్థుల క్యూ
జూన్ 15 నుంచి ప్రభుత్వ పాఠశాలలు పున:ప్రారంభమవడంతో విద్యార్థుల క్యూ కట్టారు. స్కూల్లో ఉన్న సీట్ల మేరకు అడ్మిషన్లు తీసుకున్నారు. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడంతో ఈ పాఠశాల జిల్లాలోనే ఫస్ట్ స్థానంలో ఉంది. పది పరీక్షల్లో 42 మందికి పైగా 500 మార్కులు సాధించారు. గత మూడు సంవత్సరాలుగా 500 మార్కులు సాధించిన విద్యార్థులు ఈ పాఠశాలలోనే ఎక్కువగా ఉన్నారు. దాదాపు ఈ స్కూల్లో 780 మంది పిల్లలు చదువుతున్నారు. లిమిటెడ్ స్తెంత్‌తో విద్యార్థులు ఉండటం వల్ల ఉత్తీర్ణత సాధ్యమైందని టీచర్లు అన్నారు. పోటీ తత్వం పెరగడంతో ఇంగ్లీష్‌తో పాటు అన్ని సబ్జెక్టులపైనా విద్యార్థులు పట్టు సాధిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందించిన సహకారంతో నాణ్యమైన విద్యాభోదన అందిస్తున్నామని, అందువల్లే ఈ స్కూలులో విద్యార్థులు చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని టీచర్లు తెలిపారు.






