- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
How to Kill Men: ‘మగాళ్లను చంపడం ఎలా?’.. నెట్టింట హాట్ టాపిక్‌గా మెట్రోలో యువతి చదివిన పుస్తకం
సాధారణంగా ప్రయాణాల్లో పుస్తకాలు చదవడం చాలామందికి అలవాటు. అయితే, మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ యువతి చదువుతున్న పుస్తకం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా ప్రయాణాల్లో పుస్తకాలు చదవడం చాలామందికి అలవాటు. అయితే, మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ యువతి చదువుతున్న పుస్తకం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రశాంతంగా కూర్చున్న ఆ యువతి చదువుతున్న పుస్తకం టైటిల్.. ‘How to Kill Men and Get Away With It’ (మగాళ్లను చంపి తప్పించుకోవడం ఎలా?). ఈ వీడియోకు నెట్టింట ఏకంగా మిలియన్ల వ్యూస్, లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం.
నెటిజన్ల ఆశ్చర్యం..
భర్తలను, ప్రియులను హత్య చేస్తున్న వార్తలు తరచుగా వింటున్న ప్రస్తుత తరుణంలో, ఈ వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. యువతి ఎంతో ప్రశాంతంగా పుస్తకం చదువుతుండగా.. ఆ పుస్తకం కవర్ పై ఉన్న సంచలనాత్మక శీర్షికను చూసి తోటి ప్రయాణికులు, నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై కొందరు సరదాగా కామెంట్లు చేస్తుండగా, మరికొందరు ఇటీవలి నేరాలతో ముడిపెడుతూ ఆందోళన వ్యక్తం చేశారు.
పుస్తకం వెనుక ఉన్న అసలు కథ ఇదే..
శీర్షిక చూసి ఇదేదో నేరాలు చేయడానికి సలహాలు ఇచ్చే పుస్తకం అనుకుంటే పొరపాటే. వాస్తవానికి ఇది బ్రిటీష్ రచయిత్రి కేటీ బ్రెంట్ (Katy Brent) రాసిన డార్క్ కామెడీ, సైకలాజికల్ థ్రిల్లర్ నవల. కథాంశం ఏమిటంటే.. కిట్టీ కాలిన్స్ (Kitty Collins) అనే యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మహిళలపై హింసకు, వేధింపులకు పాల్పడే పురుషులను టార్గెట్ చేసి ఆమె చేసే హత్యలు, ఆ తర్వాత చట్టం నుంచి ఎలా తప్పించుకుంది అనేది ఈ కల్పిత నవలలో ఉన్న స్టోరీ. మహిళల భద్రత, లింగ వివక్ష, ఆన్‌లైన్ సంస్కృతి, సమాజంలోని అసమానతలను వ్యంగ్యాత్మకంగా (Satire) విమర్శిస్తూ రాసిన ఫాంటసీ కథ ఇది. ఒక పుస్తకాన్ని కేవలం దాని టైటిల్ లేదా ముఖచిత్రం చూసి అంచనా వేయకూడదని వైరల్ వీడియో స్పష్టం చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ, పాఠకుల దృష్టిని ఆకర్షించడానికి పెట్టిన ఈ బోల్డ్ టైటిల్, సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ క్షణంగా మారిపోయింది.






