విద్యుదాఘాతంతో బాలుడు మృతి

by Taduka Kalyani |

విద్యుదాఘాతానికి గురై 10 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన హుజూర్‌నగర్ మండలంలోని గోపాలపురం గ్రామంలో చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో బాలుడు మృతి
X

దిశ, హుజూర్ నగర్ టౌన్ : విద్యుదాఘాతానికి గురై 10 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన హుజూర్‌నగర్ మండలంలోని గోపాలపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ చలిగంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తెప్పని అనిల్ కుమారుడు తెప్పని వర్ధన్ బాబు (10) మంగళవారం సాయంత్రం తన బంధువు తెప్పని రవి ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి పైకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఇనుప మెట్లకు విద్యుత్ సరఫరా అవుతున్న విషయం ఎవరికీ తెలియలేదు. విషయం తెలియని వర్ధన్ బాబు మెట్లు ఎక్కుతుండగా విద్యుదాఘాతానికి గురై స్పృహ తప్పి కిందపడిపోయాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి తెప్పని అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. అనిల్ తొలి భార్య మృతి చెందడంతో రెండో వివాహం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story