- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఠాణా నుంచి నిందితుడి పరారీ !
డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్న ఓ నిందితుడు నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని పరారైన ఘటన కలకలం రేపింది.

దిశ, గండిపేట : డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్న ఓ నిందితుడు నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని పరారైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మణికొండ ప్రాంతంలో హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఈగల్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి ముజఫర్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి విచారణ కోసం అతడిని నార్సింగి పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా, మంగళవారం అర్ధరాత్రి సమయంలో పోలీసుల నుంచి తప్పించుకుని నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనను పోలీసు అధికారులు ధృవీకరించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఈగల్ టీమ్ ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అతడు ఎలా తప్పించుకున్నాడు ? పోలీస్ స్టేషన్‌లో భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణాల్లో ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.






