జేసీబీలతో పంటల ధ్వంసం.. ఫార్మా భూముల స్వాధీనం

by Batti.Sumithra |

ప్లాట్లు ఇవ్వకుండా ఫార్మా భూములపై కూలీల స్టే కొనసాగుతుండగా పంటలను ఎలా ధ్వంసం చేస్తారని రెవెన్యూ, టీజీఐఐసీ, పోలీసులను గిరిజన రైతులు నిలదీశారు.

జేసీబీలతో పంటల ధ్వంసం.. ఫార్మా భూముల స్వాధీనం
X

దిశ, యాచారం: ప్లాట్లు ఇవ్వకుండా ఫార్మా భూములపై కూలీల స్టే కొనసాగుతుండగా పంటలను ఎలా ధ్వంసం చేస్తారని రెవెన్యూ, టీజీఐఐసీ, పోలీసులను గిరిజన రైతులు నిలదీశారు. మండల పరిధిలోని మంగళిగడ్డ తండా, మర్లకుంట తండా గ్రామాల్లోని అసైన్డ్ పట్టా భూములను గత ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం సేకరించగా, ఫ్యూచర్ సిటీ పనుల్లో భాగంగా బుధవారం హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ అధికారులు పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఆర్‌ఐ మురళీకృష్ణ, టీజీఐఐసీ అధికారుల ఆధ్వర్యంలో సర్వేనంబర్లు 155, 288లోని విస్లావత్ సరియా, విస్లావత్ నాన్య, కడియ, జంగు భూములను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లగా రైతులు అడ్డుకున్నారు. కోర్టులో స్టే కొనసాగుతుండగా సాగు చేసుకుంటున్న భూముల్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. తమ భూములను వదిలిపెట్టాలని మహిళలు పోలీసుల కాళ్లు మొక్కినా వినకుండా వారిని పక్కకు తీసుకువెళ్లి, జేసీబీలతో సాగులో ఉన్న జొన్న పంటలను ధ్వంసం చేశారని మహిళలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Next Story