- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20 ర్యాంకింగ్స్.. టాప్ ప్లేస్ చేజిక్కించుకున్న ఇషాన్ కిషన్
ICC విడుదల చేసిన T20 ర్యాంకింగ్స్‌లో భారత యువ వికెట్‌కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) విడుదల చేసిన తాజా T20 ర్యాంకింగ్స్‌లో భారత యువ వికెట్‌కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దాదాపు ఏడాది పాటు అగ్రస్థానంలో కొనసాగిన అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి ఇషాన్ 876 పాయింట్లతో ఈ ఘనత సాధించాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇషాన్ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో పాటు, ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో 317 పరుగులు చేసి, దాదాపు 200 స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. ఈ ప్రదర్శనలతో తన కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ సాధించి టీ20ల్లో ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా నిలిచాడు.
అలాగే తిలక్ , సూర్య కుమార్ 8వ స్థానంలో ఉన్నారు. ఇక టీ20 బౌలింగ్ విభాగంలో వరుణ్ 3, బుమ్రా 6వ స్థానంలో నిలిచారు. వన్డే ర్యాంకింగ్స్ లో బ్యాటింగులో న్యూజిలాండ్ కు చెందిన మిచెల్, గిల్, కోహ్లీ, రోహిత్ వరుసగా నాలుగు స్థానాల్లో ఉండగా.. టెస్టు బ్యాటింగ్ లో గిల్ 6, జైస్వాల్ 9 ప్లేసులో ఉన్నారు.






