- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతి నుంచే సరికొత్త ఆవిష్కరణలు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
దేశానికి అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ గేమ్ ఛేంజర్ కాబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: దేశానికి అమరావతి(Amaravati) క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(Quantum computing Centre) గేమ్ ఛేంజర్ కాబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) అన్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ క్వాంటం వ్యాలీతో ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణలు అమరావతి నుంచే అందించే అవకాశాలున్నాయన్నారు. రానున్న 40 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ ప్రతినిధులతోనూ మాట్లాడానని, త్వరలో ఒప్పందాలు పూర్తి కావాలని కోరారని చెప్పారు. ఈ సంవత్సరం చివరికి తొలి క్వాంటం కంప్యూటర్ రావాలని వారతో చెప్పానని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఏప్రిల్ 14 వరల్డ్ కంప్యూటర్ డే
ఏప్రిల్ 14 వరల్డ్ కంప్యూటర్ డే అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్ఆర్ఎమ్ వర్సిటీలో 2 క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. క్వాంటం కంప్యూటింగ్‌లో ఆవిష్కరణకర్తలకు నోబెల్ లాంటి బహుమతిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో 35 లక్షల మంది విద్యార్థులకు వైజర్ శిక్షణ ఇవ్వనుందని తెలిపారు. అత్యత్తుమ ఏఐ యూనివర్సిటీని అమరావతిలో ప్రారంభిస్తామన్నారు. వ్యవసాయం, వైద్యం వంటి రంగాల్లో క్వాంటం సేవలను వినియోగిస్తామన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది విద్యార్థులు ఏఐని అందిపుచ్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. క్వాంటం వ్యాలీ నిర్మాణంలో కేంద్ర సహకారం అనిర్వచనీయమని చంద్రబాబు పేర్కొన్నారు.






