- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandrababu Case: నిధులు అలా మళ్లాయి.. సంచలన విషయాలు చెప్పిన ఏపీ సీఐడీ చీఫ్
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ సంచలన విషయాలు చెప్పారు. ..

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ సంచలన విషయాలు చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు చేరాయని ఆయన స్పస్టం చేశారు. ఎక్స్అఫిషియో గంటా సుబ్బారావు ప్రైవేటు వ్యక్తి అని తెలిపారు. అలాంటి వ్యక్తికి చాలా పదవులు కట్టబెట్టారని తెలిపారు. కార్పొరేషన్ సరైన పద్ధతి ప్రకారం జరగలేదని పేర్కొన్నారు.
కార్పొరేషన్ నుంచి ప్రైవేటు వ్యక్తులకు డబ్బు వెళ్లిందని తెలిపారు. జీవోను పక్కన పెట్టి అగ్రిమెంట్‌ను అమల్లోకి తీసుకొచ్చారన్నారు. అగ్రిమెంట్‌లో కేవలం రూ.371 కోట్ల ప్రస్తావన మాత్రమే ఉందన్నారు. 13 చోట్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబు సంతకాలు చేశారని తెలిపారు. అగ్రిమెంట్‌లో దురుద్దేశం ఏంటో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి షెల్ కంపెనీలకు నిధులు మళ్లాయని చెప్పారు. రూ.313 కోట్లలో రూ.241 కోట్లు ఆధారం లేకుండా ఓ షెల్ కంపెనీకి వెళ్లాయని సంజయ్ స్పష్టం చేశారు. రూ. 241 కోట్లు వేర్వేరు కంపెనీలకు వెళ్లినట్లు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ చెప్పారు.
More News : Viveka Case: ఉదయ్ కుమార్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు






